చింతయామి శివ జ్ఞాన సరస్వతి

స్వాతికిరణం లో గంగాధరం అనంత రామ శర్మ గారి మెప్పు పొందేందుకు పాడిన కీర్తన. ఈ కీర్తన శారదా దేవిది. అయితే, "శివ శేఖరం", "దివాకరం" అనే పదాలు ఎందుకు వచ్చాయి? ఇది రాసింది ఎవరు?

ఈ ప్రశ్నలతో ఎన్నో రోజులుగా ఈ రీల్ చెయ్యకుండా వదిలేసాను. #KViswanath గారి ఇంటర్వూస్ అన్ని చూసి వాటికి #Youtube లో కామెంట్ చేసాను. ఎంతో మందిని అడిగాను. ఎక్కడ చూసినా ఇలానే ఉంది: 

శ్రీఖరం శివ శేఖరం
కృత సుకృత నికరవ శేఖరం
శ్రీకరం శివ శేఖరం
శుభకరం వర శేఖరం
శ్రితలోకతిమిర దివాకరం
శ్రీకరం శివ శేఖరం
రాగరస రత్నాకరం
స్వర సరసిజా రజనీకరం
చింతయామి సరస్వతి
తవచారు సుస్మిత-కౌముదిం
**
ఈ కీర్తన వివరంగా చూద్దాం: 
ఈ పాట లో మొదటి పదాలు "శ్రీకారం శివ శేఖరం" అని అనుకుని ఎంతోమంది శివుడి స్తుతి అని పొరబడుతున్నారు. అయితే మొదటి రెండు పంక్తులు కొంచం జాగ్రత్తగా గమనించాలి:
శ్రీకరం శివ శీకరం
కృతసుకృత నికర వశీకరం
శ్రీకరం శివ శీకరం
శుభకరం వర శేఖరం
శ్రితలోకతిమిర దివాకరం
శ్రీకరం శివ శేఖరం
రాగరస రత్నాకరం
స్వర సరసిజా రజనీకరం
చింతయామి సరస్వతి
తవచారు సుస్మిత-కౌముదిం
ఇందులో శివ అంటే మంచిని సూచించేది; సరస్వతి అంటే జ్ఞాన ప్రవాహం
#KViswanath గారిని కలిసివుంటే రెండు ప్రశ్నలు అడిగేదాన్ని:
1) "ఈ పాట రాసింది ఎవరు? ఈ సినిమాకి పాటలు రాసింది #SirivennelaSeetharamaSastry గారు #CNarayanaReddy గారు #VennelaKanti గారు. నాకు ఎన్నో నిద్రలేని రాత్రులకు కారణం ఎవరని నాకు తెలియాలి!" అని.
2) "గంగాధరం ఎక్కడ ఏ పాట పాడినా #VaniJairam గారు వినిపిస్తారు కదా, ఇక్కడ మాత్రం #KSChitra గారి గొంతు ఎలా పలికింది?" అని.

పోనీలెండి, ఇంత జ్ఞాన సంపదను మనం ఆలోచించుకోవటాని వదిలి వెళ్లినందుకు ప్రశ్నలు అడగలేకపోయానని బాధ లేదు. అయితే "శివ" అంటే శివుడిని, "దివాకరం" అంటే సూర్యుడని, "సరస్వతి" అంటే అమ్మవారిని, ప్రతీ పదానికి ఒక దేవతని ఊహించేసుకుంటే, ఆ ఊహ అక్కడికే పరిమితం అవుతుంది. కాబట్టి:

ఈ కీర్త వివరం గా చూద్దామా?
శ్రీకరం శివ శేఖరం అని ఉంటే దాని అర్ధం: శ్రీకరం = గొప్ప మార్గం, శివ= శుభం/ మంగళకరం, శేఖరం= జ్ఞాన శిఖరం (crest jewel / వివేకచూడామని లాంటి పాదాల నుంచి వచ్చింది)
కృత సుకృత నికరవ శేఖరం: కృత - చక్కగా సాధించిన కార్యము, సుకృత - మంచి ఫలితం, నికరవ= ప్రసాదించే శేకరం

అయితే ఆ మొదటి మాటలు ఇవి కాబట్టి:
శ్రీకరం శివ శీకరం:
(శ్రీకరం) గొప్ప మార్గంలో (శివ) మంగళకరమైన శుభములను వెదజల్లేది
కృతసుకృత నికర వశీకరం
(కృతసుకృత) పాపపుణ్యములను; (నికరము) మొత్తము; (వశీకరం) ఆకర్షించి
శుభకరం వర శేఖరం
శుభకరం= శుభాలని ఇచ్చే; 
శ్రితలోక తిమిర దివాకరం; 
శ్రితలోక= దేవతా లోకాలు, తిమిరం = చీకటి, దివాకరం= వెలుగును ఇచ్చేది; శ్రీకరం శివ శేఖరం
రాగరస రత్నాకరం
రాగాల భావాలు రత్నాలుగా ఉన్న గని
స్వర సరసిజా రజనీకరం
స్వరాలు, సరసిజా= తామర పువ్వు, రజనీకరం= చంద్రుడి వెలుగు
చింతయామి సరస్వతి
చింతయామి= ధ్యానించుట, సరస్వతి= జ్ఞానాన్ని, ధ్యాసను సరసులా ప్రవాహం చెయ్యగలిగిన మూర్తి
తవ చారు సుస్మిత-కౌముదిం
తవ= తమ, చారు = అందమైన, సుస్మిత= చక్కని నవ్వు, కౌముదిం= మంచి వాక్కుని ఇచ్చేది.

ఇందులో ముఖ్య పాదాల అర్థాలు:
శ్రీ= సంపద, శివం= మంగళకరం, సుకృత నికరం= పుణ్య రాశి, వశీకరం = ఆకర్షించునది, వర శేఖరం= శ్రేష్ఠమైనది / వరములను దాల్చినది, శ్రిత= ఆశ్రయించిన వారు, రత్నాకరం= సముద్రం, సరసిజ= కలువ, రజినీకర= చంద్రుడు, తవ = నీ యొక్క, చింతయామి= స్మరించెదను, సుస్మిత= అందమైన చిరునవ్వు, కౌముది= వెన్నెల

Instagram లో నా పోస్ట్ చూసి గొఱుగంతుల రాజ శేఖర్ గారు చెప్పిన అర్ధం: 
ఇది సరస్వతీదేవి యొక్క అందమైన నవ్వు గురించి వ్రాయబడిన కీర్తన. అర్థం ఇలా ఉంటుంది:
అమ్మ! సరస్వతి దేవి! నీ యొక్క తెల్లని వెన్నెల వంటి చిరునవ్వును నిత్యము స్మరిస్తాను. అది శ్రీకరమైనది అనగా సంపదలను ఇచ్చేది. శివశీకరం అనగా శుభములనుు వెదజల్లేది. మేము చేసుకున్న పాపపుణ్యాలను వశపరచుకునేది అనగా భవ బంధాలను తొలగించేది. అమ్మ, నీ నవ్వు శుభకరమైనది, శ్రేష్ఠమైనది. ఆశ్రయించిన వారి చీకట్లను తొలగించే సూర్యుని వంటిది. రసయుక్తమైన అనేక రాగాలను తనలో నింపుకున్న సముద్రం వంటిది. స్వరములు అనే కలువలను పూయించే చంద్రుని వంటిది. అటువంటి నీ దరహాసాన్ని నిత్యము నేను స్మరించెదను గాక!
సినిమాలో ఈ పాటని ఇక్కడ చూడవచ్చి :  https://www.youtube.com/watch?v=qBkDdIHKN6w
మా ఇంస్టాగ్రామ్ రీల్ :  https://www.instagram.com/p/C6uzpHUJaBD/

ఇట్లు,
https://www.instagram.com/lens.of.amruta/

Comments

  1. చిత్ర మరియు వాణి జయరాం గారు, అనే టాపిక్ తప్ప ఇంచుమించు గా నాకు ఇదే సందేహం,

    Thankyou very much for this story

    ReplyDelete

Post a Comment