సినీ కవులు - పద ప్రయోగాలు

 ఒక పాటలో ఉన్న పదాలను బట్టి ఆ పాట రాసిందెవరో కనిపెట్టడం సాధ్యమా?

ఒక పాట కొన్నేళ్ళపాటు నిలిచిపోవాలంటే పాట వినటానికి, పాడుకోవటానికి బాగుండాలి. అందుకే కదా "నాటు నాటు" పాటని పెద్ద పెద్ద వేదికలు గుర్తు చేస్తున్నప్పుడు కీరవాణి గారు ఆ పాట చెయ్యటానికి కారణం అయినా వారందరినీ గుర్తుంచుకుని మరీ గుర్తు చేస్తున్నారు. కొన్ని పాటలు వింటే అది పాడింది ఎస్ పి బాలు గారు అనో సుశీల గారనో తెలిసిపోయినట్టు, కొందరు సినిమా కవులు వాడే పద ప్రయోగాన్ని బట్టి అది రాసేది వారే అని కొంత వరకు కనిపెట్టచ్చు. ఇప్పడు వచ్చే పాటల గురించి తరవాత ఇంకెక్కడైనా అనుకుందాం.


పాత పాటల్లో "మనసు" మీద ప్రయోగం ఈయన చేసినట్టు ఎవ్వరూ చేసి ఉండకపోవచ్చు. అందుకే ఆత్రేయ గారిని "మనసుకవి" అంటారు, అంటే ఈయన అది తప్ప ఇంకేమి రాయలేదని కాదు. వీణ పాటలు, అమ్మ పాటలు ఎన్నో రాశారు. అలా అని వేరే కవులు మనసు మీద రాయలేదని కూడా కాదు. కానీ ఎక్కువ పాటలు ఈయన రాసారు, సురేష్ ప్రొడక్షన్స్ వారు ఎక్కువగా రాయించుకునే వారు కాబట్టి వాళ్ళ సినిమాలో పాటలు ఈయనే రాసారని చెప్పవచ్చు, వివరాలు ఇక్కడ ఉన్నాయి. (https://resorcio.com/products/life-and-cine-works-of-writer-athreya), అలాగే అదే సమయంలో సంసార సాగరాల్లో తేనె పలుకులు పూయించగాలిగారు "కూనాలమ్మ పలుకుల" ఆరుద్ర గారు, బాపు రమణల సినిమాలు చాలా వాటిల్లో ఈయనే రాసారు. వివరాలు (https://resorcio.com/products/life-and-works-of-cine-writer-arudra) విప్లవ గీతాలకు పెట్టింది పేరు మహాకవితాగ్ని శ్రీశ్రీ గారు, ఆ పాటలు వింటే "తెలుగు వీరుడు లేవాల్సిందే", ఆయన సినిమా పాటలు ఒక ఎత్తు, మహాప్రస్థానం ఇంకో ఎత్తు. అందులో కొన్ని పాటలు సినిమాల్లో కూడా పెట్టారు, వివరాలు ఇక్కడున్నాయి (https://resorcio.com/products/life-and-works-of-cine-lyricist-sri-sri). ఇక రాసిన అన్ని పాటల్లో ప్రకృతి అందాలని, సౌందర్యలని వెలికి తీసి రాసేవారు దేవులపల్లి గారు, ఆయన పాటలు తెలుగు పలుకుల కవితా తరంగాలు, అవి వింటే ఎవరైనా "పరవశమై తెలుగు పాటలు" పాడదాం అనుకుంటారు, అమెరికా అమ్మాయితో సహా. వివరాలు ఇక్కడ ఉన్నాయి (https://resorcio.com/products/life-and-works-of-cine-lyricist-devulapalli-krishna-sastry). ఇక సంగీతానికి సాహిత్యానికి సమలంకృతం చేసినవారు సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు. ఆయనకి జ్ఞానపీఠ్ అవార్డు కూడా వచ్చింది. "నటనము ఆడవే మయూరి" అని రాసిన కొన్ని పాటలు నాట్యానికి కూడా అనుకూలంగా ఉంటాయి అంటారు.  ఆయన పాటల వివరాలు ఇక్కడ ఉన్నాయి (https://resorcio.com/products/writers-and-philosophers) ఆత్రేయ గారు ఒక్కోపాటకీ చాలా సమయం తీసుకుంటున్నారని ఆంధ్ర ప్రభలో ఓ పాత్రికేయుడితో రాయించుకున్నారు అప్పట్లో. ఆయన క్లబ్ పాటల్లో వేదాల సారాన్నైనా, జీవన రాగాన్ని, వేణు గీతాన్ని రాయగలిగిన వారు, ఇంటిపేరు "వేటూరి". "దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకం గురించి అబ్బనీ తియ్యనీ దెబ్బ"ల గురించి రాసేశారు. వివరాలు ఇక్కడ (https://resorcio.com/products/the-literary-compositions-of-veturi). నేను పుట్టేసమయానికి సంగీతానికన్నా సాహిత్యానికి పెద్ద పీఠం వేసి పాశ్చాత్య సంస్కృతిలో కూడా పాటని బ్రతికించిన వారు సీతారామ శాస్త్రి గారు. ఈయన కొంచం 1990 తరువాత  కాలంలో మంచి పాటలకి అడ్రస్ అయ్యారు, ముఖ్యంగా జీవితాన్ని గురించి జీవన సంవిధానం గురించి రాస్తారు. (https://resorcio.com/products/deeper-meaning-in-the-song-jagamantha-kutumbam-by-poet-sirivennela) వాళ్ళు అలా రాయటానికి వారి జీవితంలో అనేక సందర్భాలు, బ్రతుకుని వారు అర్ధం చేసుకున్న పద్దతి మనకి తెలుస్తుంది. అసలు అంత సాహిత్యాన్ని ఎలా వెలుగులోకి తీసుకురాగాలిగారో అర్ధం అవుతుంది. 

వీరి సమయంలో ఇంకొంతమంది సినిమా కవులు కూడా ఉన్నారు. ఒకరు చాలా తేలిక పదాలతో గమ్మత్తుగా రాసేస్తారు, చంద్రబోస్ గారు. అనువాద పాటలు మనకి పాడుకోవటానికి వీలుగా రాసిన "రాజశ్రీ" గారు. ఆపుడప్పుడు భలేగా రాశారే అనిపించే రామజోగయ్య శాస్త్రి గారు. కొంచెం అచ్చ తెలుగు పదాలు వాడే అనంత్ శ్రీరామ్ గారు. వీరితో పాటు ఇంకా చాలా మంది ఉన్నారనుకోండి, గుర్తుకొచ్చినప్పుడు తలుచుకుందాం. కొన్ని పాటలు వినటానికి బావుంటాయి కానీ పడుకోలేము, "కునుకే ఆగాలి వనుకే తగ్గాలి, కానుకే తాగాలి 3రోసెస్ టీ." కొన్ని పాటలు చాలా బావుంటాయి కానీ అసలు అది సినిమా పాటేనా, ఎప్పుడు వచ్చింది? అనిపిస్తుంది. "పూత వేసిన లేత మావిని చూసినట్టుంది నీ నవ్వు చూస్తుంటే, పాత పాటలు కోకిలమ్మే పాడినట్లు ఉందీ నీ పలుకు వింటుంటే" అన్న పాట ఎప్పుడన్నా విన్నారా? వినే ఉంటారు, ఈ మధ్య నా రీల్స్ లో పెట్టాను, వినండి. ఎప్పుడు వాడని తెలుగు పదాలు వింటే కమ్మగా అనిపించే ఒక వింత అనుభవం ఇస్తుంది. ఈ పాట ఎంత బాగుంటుందో, కానీ ఏ సినిమా అంటే తెలియదు, ఆ సినిమా అసలు ఎక్కడా దొరకట్లేదు కూడా. సినిమా పెద్దగా ఆడక పోవటం వల్ల మనకి తెలియదు. 

సరే ఇప్పుడూ మనం మాట్లాడుకోబోయే పాట ఎవరు రాసుంటారో కనిపెడదాం, ఇలాంటి పాట మనం తలుచుకోక పోతే కనుమరుగు అయిపోతుంది. సరే, ఈ పాటలో పదాలు చూడండి, "గల గల గమకము పడే గళం తానై, బిర బిర పలుకులు తీసే మహా పదమై సరి సరి నటనలు ఆడే నాదీ కాంత". ఈ రీల్ షేర్ చేసాను, సింగర్ గొంతును బట్టి అది పాడింది సింగర్ సునీత గారు, సంగమం అన్న సినిమా లోనిది, రసూల్ ఎల్లోర్ గారు తీశారు, ఆయన తీసిన ఇంకో సినిమా, "ఒకరికి ఒకరు"ని మ్యూజికల్ హిట్ చేసింది కీరవాణి గారు కాబట్టి దీనికి కూడా ఆయనే, అయితే రాసినది ఎవరు?

ఇందులో జంట పదాల ప్రయోగం జరిగింది. "గల గల", "బిర బిర", "సరి సరి" ఇలాంటి పదాలు "అడపా-దడపా" తక్కువమంది సినిమా కవులు ఉపయోగించారు. "తేట తేట తెలుగులా" అన్న పాటలో ఆచార్య ఆత్రేయ గారు ఇలాంటి పదాలు వాడారు. ఈ పదాలు వేటూరి గారు చేసే "వేదం-నాదం" లా "మాట -అర్ధం" లా కాకపోయినా "అంద-దండ" ఇచ్చే సినారె గారు వాడే "సువ్వి-సువ్వి" పాటలోలాగా ఉంటాయి. ఈ పాట "సంగమం" సినిమా లోనిది. ఆది 2008లో వచ్చింది. దాదాపు అదే సమయం లోనే సినీ రచనా ప్రారంభం చేసారు ఈయన కూడా. పైగా "సంగమం" సినిమాలో ఇందాక చెప్పుకున్నా "పూత వేసిన లేత మావి" పాటను కూడా ఈయనే రాసారు. ఈమధ్య కాలం లో ఇలాంటి ప్రయోగం ఈ పాటలో విన్నాను "తాను-నేను, మొయిలు-మిన్ను" అనే పాటలో జంట పదాలు ప్రయోగం ఉంటుంది, అది రాసినది కూడా అనంత్ శ్రీరామ్ గారే "సాహసం శ్వాసగా సాగిపో సినిమాకోసం. 

జంట పదాలు గురించి నేను సేకరించిన సమాచారం ఇక్కడ ఉంది. (https://resorcio.com/products/telugu-words-that-are-used-in-pairs)


తెలుగులో వ్యాకరణాన్ని ఆధారంగా తీసుకున్న పాటలు ఎక్కువ సాహిత్యపు మాధుర్యాన్ని అందిస్తాయని, ఆ సాహిత్యం ఎక్కువ కాలం నిలుస్తుందని నా అభిప్రాయం.

Comments