సినిమాలా లో సంధ్యా సమయంలో దీపం పెట్టుకునే వేళ, వేదాంతం శేషగిరి శర్మ గారి పెద్దమ్మాయి పాట ద్వారా సందర్భాన్ని, సన్నివేశాన్ని ఆ అమ్మాయి గుణాలని మనకి పరిచయం చేస్తారు విశ్వనాధ్ గారు. ఆ అమ్మాయి తండ్రి మార్గంలో నడుస్తోంది, శాస్త్రీయ సంగీతం పాడుతుంది అని చెప్పేందుకు ఒక శ్లోకం ద్వారా ఆ కుటుంభం గడిపే విధానం, పెద్దమ్మాయి పడుతున్నప్పుడు చుట్టూ ఉన్న నాలుగిళ్ళ వాళ్ళు ఎలా ఎదురుచూస్తున్నారు, ఎలా ఆస్వాదిస్తున్నారు, చిన్నమ్మాయి ఆకాశంలో ఆశల ఆనందాన్ని ఎలా వెతుకుంతోంది, అన్ని మేడపై నుంచి గమనిస్తున్న కథానాయకుడు.
అయితే, ఒక రామలాలి పాడుతూ తల్లి వేదాంతం చెప్పినట్టు, ఘల్లు ఘల్లు పాటలు నేర్పుతూ జీవన సంవిధానంలో భారతీయ సంస్కృతిని భోధించినట్టు, కాలక్షేపానికి పైన సినిమాలో ఒక నాలుగు కుటుంబాలు కలుసుకున్నప్పుడు పాడుకునే పాటలో ఒక శంకరుడి యోగ సాధనం నేర్పాలనో ఏమో "ఆత్మాత్వం గిరిజా మతిః" అంటూ శ్లోకాన్ని ఈ సినిమా లో పెట్టారు. ఇది "శివ మానస పూజ" లోనిది, స్తోత్రం రాసింది శ్రీ ఆదిశంకరాచార్యులు. "శివ మానస పూజ" వచనంతో మనసుని ఆరాధన రూపంగా శివుడికి అంకితం అవ్వటం ఎలాగో వివరిస్తుంది. శివుని రూపాన్ని తలచుకున్న తర్వాత, హృదయానికి శివభక్తి నిరంతరం అలవాటు ఎలా అవుతుందో చూద్దాం.
ఆరాధ్యామి మని సన్నిభం ఆత్మ లింగం
మాయాపూరి హృదయ పంకజ సన్నివిష్టం
శ్రాధ నది విమలాచిత జలబిషగై
నిత్యం సమాధి కుసుమైర పునర్భవై
నా ఆత్మలో కొలువైన లింగాన్ని, నా భక్తి సాగరంలోని మంచి నీటితో శుభ్రపరిచి, దానికి ప్రతిరోజు నా హృదయాన్ని తామరపువ్వును చేసి, పూజచేస్తూ, పునర్జన్మ అవసరంలేకుండా ఆరాధిస్తున్నాను.
రత్నైః కల్పితమాసనం హిమజలైః స్నానం చ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమదా మోదాంకితం చందనమ్ ।
జాతీ చంపక బిల్వపత్ర రచితం పుష్పం చ ధూపం తథా దీపం దేవ దయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతామ్ ॥ 1 ॥
జీవుల యజమాని ఐన శివా, నీకోసం విలువైన రాళ్ల సింహాసనాన్ని, స్నానం చేయడానికి హిమాలయాల నుంచి చల్లని నీరు, అనేక ఆభరణాలతో అలంకరించబడిన దైవిక వస్త్రాలు, నీ శరీరానికి అభిషేకం చేయడానికి కస్తూరితో కలిపిన గంధం, మల్లె, చంపక పువ్వులు, బిల్వా ఆకులు, అరుదైన ధూపాలు, మెరిసే జ్వాల నా హృదయంలో ఊహించుకున్నాను.
సౌవర్ణే నవరత్నఖండ రచితే పాత్రే ఘృతం పాయసం భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభాఫలం పానకమ్ ।
శాకానామయుతం జలం రుచికరం కర్పూర ఖండోజ్జ్చలం తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురు ॥ 2 ॥
తొమ్మిది ఆభరణాలతో పొదిగిన బంగారు గిన్నెలో తీపి, బియ్యం, పాలు మరియు పెరుగుతో తయారు చేసిన ఐదు రకాల ఆహారం, అరటిపండ్లు, కూరగాయలు, కర్పూరం సువాసనగల నీరు, బెట్టు ఆకు – వీటిని నా మనస్సులో భక్తితో సిద్ధం చేశాను.
ఛత్రం చామరయోర్యుగం వ్యజనకం చాదర్శకం నిర్మలం వీణా భేరి మృదంగ కాహలకలా గీతం చ నృత్యం తథా ।
సాష్టాంగం ప్రణతిః స్తుతి-ర్బహువిధా-హ్యేతత్-సమస్తం మయా సంకల్పేన సమర్పితం తవ విభో పూజాం గృహాణ ప్రభో ॥ 3 ॥
ఒక పందిరి వేసి, అలంకరించి, మచ్చలేని అద్దం, వీణ, మృదంగం, డోలు తో పాటలు పాడి నాట్యం చేస్తున్నా, సాష్టాంగ నమస్కారం, ఎన్నో శ్లోకాలు – ఇవన్నీ నా ఊహలో నీకు సమర్పిస్తున్నాను, నా ఆరాధన స్వీకరించు.
ఆత్మా త్వం గిరిజా మతిః సహచరాః ప్రాణాః శరీరం గృహం పూజా తే విషయోపభోగ-రచనా నిద్రా సమాధిస్థితిః ।
సంచారః పదయోః ప్రదక్షిణవిధిః స్తోత్రాణి సర్వా గిరో యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనమ్ ॥ 4 ॥
నేను స్వయంగా నీ రూపాన్ని; నా పుట్టుకకు కారణం తల్లి పార్వతి దేవి. నా పంచ ప్రాణాలు, ఇంద్రియాలు నీ సేవకోసమే, నా శరీరం నీ గుడి, నీ ఆరాధన కోసమే. నా నిద్రా స్థితి నీ సమాధి స్థితి. నేను నడిచినప్పుడల్లా నీ చుట్టూ ప్రదక్షణమే చేస్తున్నాను, నా నోటి వెంట వచ్చే ప్రతి మాటా నిన్ను స్తుతించటానికే, నేను చేసేదంతా నిన్ను ఆరాధించడమే.
కర చరణ కృతం వాక్కాయజం కర్మజం వా శ్రవణ నయనజం వా మానసం వాపరాధమ్ ।
విహితమవిహితం వా సర్వమేతత్-క్షమస్వ జయ జయ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో ॥ 5 ॥
నా చేతులు, కాళ్ళు, స్వరం, శరీరం, చెవులు, కళ్ళు, మనస్సుతో నేను తెలిసి లేదా తెలియాక చేసే నేరాలను పెద్ద మనసుతో మన్నించు. ఓ కరుణా సముద్రా, దీన భాందవా! శంభో శంకర!
మాతాచ పార్వతి దేవి పితా దెవొ మహేశ్వర
బాంధవా శివ భక్తంశ్చ స్వదేశో భువన త్రై
నా తల్లి పార్వతి, నా తండ్రి శివుడు, శివుడిని ఆరాధించేవారు నా స్నేహితులు, నా స్వస్థలం మూడు భువనాలు.
Comments
Post a Comment