తోకచుక్క తెచ్చిన ఆపద ఎవరికి ?
ఈ సినిమా లో మన హీరోలు చోళ రాజ్యానికి యువరాజులు. వీళ్ళకి పాండ్యులు శత్రువులు. సినిమా మొదట్లో ఒక తోకచుక్క చోళ రాజ్యంపై కనిపిస్తుంది, అది నాశనానికి సంకేతం. ఎవరి నాశనం?
మనకి క్యారెక్టర్ల పేర్లు కన్నా ఆ వేషం వేసింది ఎవరో చెప్తే అర్ధం అవుతుంది. సరే ఈ సినిమా లో చోళ రాజ్యానికి చక్రవర్తి "సుందర చోళుడు" (ప్రకాష్ రాజ్). ఆయనకీ ముగ్గురు పిల్లలు. మొదటి వాడు ఆదిత్య కరికాలుడు (విక్రమ్) రెండవది ఆడపిల్ల కుంధవై (త్రిష), మూడవ వాడు అరున్ మొళి, అతనే పొన్నియిన్ సెల్వన్. (అంటే పొన్ని నది కాపాడిన వాడు)- "జయం" రవి (చిరంజీవి గారి సినిమా గాడ్ ఫాదర్ సినిమా దర్శకుడు మోహన్ రాజా గారి అబ్బాయి.
సుందర చోళుడు తంజావూర్ కోటాలో అనారోగ్యం తో ఉన్నాడు, ఆదిత్య ఉత్తరాన సేవర్ యుద్ధ భూమిలో "వీర పాద్యుడిని" హతమార్చాడు దానితో పాండ్యులు చోళ రాజ్యం లోకి అక్రమంగా ప్రవేశించారు. ఆదిత్య స్నేహితుడు వల్లవరాయుడు వంతిదేవన్, కార్తీ. ఈ మొదటి సినిమా కథని మోసిన పాత్ర. తండ్రి అనారోగ్యం తో తంజావూర్ లో కాక తనతో ఉండాలని ఆదిత్య వల్లవరాయుడితో కుంధవైకి లేఖ పంపుతాడు, నందిని ఉన్న చోటుకి రావటం ఇష్టం లేక. ఆదిత్య సందేశం కాకుండా వేరే ఆపదలు ఉన్నాయని కనిపెడతాడు వల్లవరాయుడు.
చిన్నప్పుడు ఆదిత్య కరికాలుడిని ప్రేమించిన ప్రేయసి, నందిని. ఈ పాత్ర పోషించింది ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయి. తన అందం తో మనుషులని కట్టిపడేసి తనని మోహించిన వారినే తెలివిగా ఉపయోగించుకునే పాత్ర. వాఙ్రాలఘని లాంటి తన అందం ముందు ఖజానా చూసి వల్లవరాయుడైనా ప్రలోభ పడ గలడా? కుంధవై ఇంకా సెంబీయన్ మహాదేవి అనాధ అని ఆమెను వెళ్ళగొడతారు. ఆమె అందానికి కుంధవై కూడా అసూయ పాడేది. ఆ తరువాత నందిని, ఓ వీర వైష్ణవుడి (జయరాం)(ఇతను సెంబియన్ మహాదేవికి మంత్రి కూడా) తో కలిసి కొన్నాళ్ళు పెరిగి, వీరపాండ్యుడి (నాజర్) తో ఆదిత్యుడికి కనిపించింది. వీర పాండ్యుడిని చంపాక నందిని పెద్ద వెలివేట్రాయుడుని- (చోళ రాజ్యానికి కోశాధికారి,ఒక సామంత రాజు కూడా (శరత్‌కుమార్)) పెళ్లి చేసుకుంది. ఇలా ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని ఆదిత్య తంజావూర్ లోకి అడుగు పెట్టడు.
తంజావూర్ లో కుట్ర
నందిని వీర పాండ్యుడితో కనిపించింది అంటే పాండ్యులకు సాయం చేస్తోంది. మరో వైపు సామంత రాజులు (పెద్ద వెలివేట్రాయుడు, చిన్న వెలివేట్రాయుడు తో సహా) సుందర చోళుడి పెద్ద నాన్న కండరాదిత్యుడు అకాల మరణం తరువాత అతని కొడుకు ఇప్పుడు చక్రవర్తి అయ్యే యోగ్యుడని మధురాంతకుడిని రాజుని చేయాలనుకుంటున్నారు. మధురాంతకుడి తల్లి సెంబియన్ మహాదేవి శైవ భక్తురాలు, సుందర చోళుడి కొడుకులే సమర్ధులని, మధురాంతకుడు రాజు అయ్యేందుకు అనర్హుడని భావిస్తుంది. కానీ మధురాంతకుడికి కాంక్ష. అంతే కాక నందిని కూడా మధురాంతకుడు రాజు అవ్వాలని తన భర్త పెద్ద వెలివేట్రాయుడిని రెచ్చగొడుతుంది. కాబట్టి సుందర చోళుడి కొడుకులు ఆదిత్య, అరుణ్ (పొన్నియిన్ సెల్వన్) ఇద్దరూ తంజావూర్ రావాలని సుందర చోళుడికి చెప్పించి మరో వైపు వాళ్ళని చంపే కుట్ర చేస్తుంది.
అరుణ్ (పొన్నియిన్ సెల్వన్) శ్రీలంక ను జయించటానికి వెళ్లి తండ్రి ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అయితే అతనికి నీటిలో ఏ ఆపద వచ్చినా ఓ తల్లి కాపాడుతుంది. తను నీటిలో పాడినప్పుడు కూడా కాపాడింది నది కాదు ఒక ఆడ మనిషే, మరో సారి ఎనుగుపై వచ్చి కాపాడింది. ఆవిడ ఎవరు?
మనకి తెలియాల్సిన సమాధానాలు ?
లంక నుంచి బయలుదేరిన పొన్నియిన్ సెల్వన్ ఇంకా వల్లవరాయుడు నౌక తో మునిగి చనిపోయాడని వార్త తంజావూర్ కి వచ్చింది. అది విన్న ఆదిత్యుడు నందినిని చంపేస్తానని బయలుదేరాడు. ఈ కథకి పొన్నియిన్ సెల్వన్ పేరు ఎందుకు పెట్టారు? అంటే అతను బ్రతికే ఉన్నాడా? నీటిలో ఎప్పుడు కాపాడే ఆ తల్లే రక్షించిందా? ఆవిడ సినిమా చివరిలో నందిని లా ఎందుకు/ ఎలా కనిపించింది. పాండ్యుల కుట్రల మధ్యా చోళులు, చోళులు కుట్రల మధ్య సుందర చోళుడి కొడుకులు గెలుస్తారా? ఆదిత్య ని ప్రేమించిన నందిని వీరపాండ్యుడితో ఎందుకు కనిపించింది? చివరికి సుందర చోళుడి తర్వాత చక్రవర్తి ఎవరు? మరి తోకచుక్క తెచ్చిన ఆపద ఎవరికీ?
Comments
Post a Comment