"కాంతారా" కి కృష్ణ వంశి "మురారి" సినిమా కి పోలిక ఉందా??
మొత్తానికి కాంతారా సినిమా చూశాను. ఇంతకీ కాంతారా అంతే "ఒక వింత అడవి లేదా ఒక సంకేతం" అని అర్ధం అట. మొదట్లో పంథొమ్మిదో శతాబ్దం.. ఒక రాజు.. ఆ రోజుకో అసంతృప్తి... ఆగండి ఆగండి.. ఇదేదో కృష్ణవంశీ సినిమాలా ఉందే. పంథొమ్మిదో శతాబ్దం ఆశ్వయుజ బహుళ అమావాస్య.. ఒక రాజుకి ఋణం వలన అసంతృప్తి.
మురారి సినిమాలో కూడా, తెల్ల దొరల దగ్గర తీసుకున్న అప్పు తీర్చడానికి తన కుల దైవాన్నే (ఒక గ్రామాన్ని రక్షించే దేవత) అమ్ముకోవాలనుకున్న ఓ జమీందారు. తన పాపం అమ్మవారి శాపమై తన కుటుంబాన్ని వెంటాడుతూ ఉంటుంది. ప్రతి 48 ఏళ్ళకి అఖండ జ్యోతి కొండెక్కి ఒకరి ప్రాణం కోరుకుంటుంది. ఆ సినిమాలో మూడో తరంలో హీరో ప్రాణానికి ముప్పు. తప్పించుకోలేని శాపం ఒకవైపు వెంటాడుతుంది. మరో వైపు తరాలు మారుతున్నా అమ్మవారి శాపానికి విరుగుడు తెలియక రాత్రీ పగలు దైవ ధ్యానం లో అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలనుకునే శబరి బామ్మ. మురారి ఆంటే బృందావనం లో కృష్ణుడు, మంచి సంకల్పం తో ఉన్న వాడు, శాపాన్ని అదిగమించాడు.
ఈ రెండు సినిమాల్లో ఈ దైవాతీత శక్తి గురించి చెప్పారు. వాటితో పాటు నటీ నటుల హావభావాలు, సంగీతం, పాటలు, ఫైట్స్, మధ్యలో రొమాన్సులు. కాంతారా సినిమా వల్ల యక్షగానం, అంటే మన ఊళ్ళల్లో జానపద కళారూపాల వైభవాన్ని చెప్పారు. యక్షగానాన్ని బాగోతం నాటకాలని ఇక్కడ అంటారు. ఈ ప్రక్రియలో పాటలు, పద్యాలు, ఆది తాళం ఉంటాయి, ఇది రాత్రులు నుండి అర్ధరాత్రి వరకు ప్రదర్శించేవారు. యక్షగానాన్ని ప్రజల వినోదానికి ఉపయోగించేవారు, డబ్బు ఆశించి కాదు. ముందు సభ్యులు ఆటలు-పాటలతో నాటకాలు వేస్తుంటే వెనక సభ్యులు కోరస్ పాడేవారు, పాత్రలని పరిచేయం చేయటం కోసం ఒకడు ఉండేవాడు. ఇది తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆడేవారు. పాటల రూపంలో కథల యొక్క సుదీర్ఘ కథనంలా ఉండే యక్షగానం, వీధి నాటకం నుండి ఉద్భవించింది. ఇది ఒక కళారూపం, అపారమైన నైపుణ్యం తో చెయ్యబడుతుంది. ఇంకొన్ని జానపద కళారూపాల గురించి ఇక్కడ ఉంది. (https://resorcio.com/products/telugu-folk-songs-janapada-geetalu)
అయితే మన దగ్గరకుడా పండగలకి జాతర చేసినప్పుడు అమ్మవారు పూని జరగబోయే విషయాలు చెప్తుందని నమ్ముతాము కదా. అవి నిజంగా జరుగుతున్నాయో లేదో కానీ, ఎదో తెలియని శక్తి మాత్రం ప్రకృతిని కాపాడుతోందన్న నిజం కాదనగలమా? ఐతే ఇంతకీ కాంతారా సినిమాలో శివ, అతని తండ్రి అదృశ్యం అవ్వటం, మురారి సినిమా లో శబరి బామ్మా నదిలోకి వెళ్లి మునిగిపోవటం ప్రకృతి ఆజ్ఞని పాటించి, తమ వంతు సాయం చేసి, ప్రకృతిలో కలిసి పోవాలన్న మంచి కర్తవ్యాన్ని సూచిస్తుందని నా అభిప్రాయం.
Comments
Post a Comment