ప్రపంచంలో ఎన్నో తాత్విక సంప్రదాయాలు ఇందులో ముఖ్య పాత్ర పోషించాయని గమనించారా?
అవతార్ 2009లో విడుదలై అఖండ విజయం సాధించి మళ్ళి 2019లో అవెంజర్స్ ఎండ్ గేమ్ తో పోటీ పడి కాసుల వర్షం కురిపించి మళ్ళి 2022 సెప్టెంబర్ లో అల్ట్రా 4కె టెక్నాలజీ లో దీని రెండవ భాగం డిసెంబర్లో విడుదలకు సిద్ధం అవుతుండగా మళ్ళి రీ- రిలీజ్ చేస్తున్నారు. ఇందులో చూడాల్సిన విషయాలు ఏమిటి? ప్రపంచవ్యాప్తంగా ఎందుకు ఇంతటి ఆదరణ పొందింది?
సినిమాలో కథానాయకుడు జేక్ తన మానవ శరీరాన్ని విడిచి పాన్డోరా అనే గ్రాహంలో నావి అనే పిల్లి జాతి నీలి రంగు వాళ్ళతో కలిసిపోతాడు. ఒక విధంగా చెప్పాలంటే అత్యుత్తమమైన మానవ శరీరం నుంచి విమోచనం పొంది అంతకు మించిన జీవరాసులలో కలిసిపోయాడు అన్నమాట. నావి సంస్కృతికి సంబంధించిన కొన్ని తత్వాలు మన భూమిపై అనేక దేశాల్లో ఆధ్యాత్మిక వారసత్వంగా నమ్మబడే అంశాలు. అవేంటో చూద్దాం.
"అవతారం" అన్న పదం భారతీయులకి కొత్తేమి కాదు. సంస్కృత పదమైన 'అవతార్' అంటే విష్ణువు/దేవుడు ఎక్కడో పై లోకాలనుంచి కిందకి, అంటే, భూమికి దిగివచ్చి దుష్ట శక్తుల నుండి రక్షించడం అని నమ్ముతాము కదా. భారతీయ పురాణాల ప్రకారం గరుడ వాహనంపై చతుర్భుజుడైన నీలి రంగు చర్మంతో విష్ణువు ఉంటాడని మనం నమ్మినట్టే ఈ సినిమాలో హీరో జేక్ భూమి నుంచి భూమికి దిగువలో ఉన్న పాన్డోరాకి దుష్ట మనుషులనుంచి రక్షించడానికి నీలి రంగు శరీరం లోకి ప్రవేశిస్తాడు.
అందుకే ఈ సినిమా పేరు హిందూ పురాణాలనుంచి స్వీకరించి పెట్టారని అంటారు. అయితే హిందూ సంప్రదాయాలు కాక ఇంకా ఎన్నో సంప్రదాయాలు ఇందులో కనిపిస్తాయి, అవేంటంటే:
1. క్రిస్టియానిటీ కోణంలో అవతార్ అంటే "వ్యక్తీకరణ", గ్రీకులో 'ఎన్సార్కోసిస్' అంటే మాంసముద్దలోకి జీవం రావటం, క్రీస్తు కూడా తాను యేసు స్వరూపంలోకి ఎలా అవతారమెత్తాడో మనకి తెలిసిందే.
2. పాన్డోరా, ప్రాచీన గ్రీకు భాషలో 'అన్ని బహుమతులు ఇచ్చేది', పాన్డోరా లో భూమాత "ఐవా" గ్రీకు పురాణాలలో "గియా" అనే భూమాత పేరుని సూచిస్తుంది. పాన్డోరా, సంసారాన్ని పోలి ఉండే లాస్ట్ ప్యారడైజ్, బౌద్ధమతంలో సంపూర్ణ భ్రాంతి కలిగించే వాస్తవికత. 3. రాడికల్ పర్యావరణ వేదాంత, దావోయిజం, ఆసియాలో టావోయిజం,జెన్ మతాలలో తాత్విక సంప్రదాయాలలో పర్యావరణ శాస్త్రాన్ని సూచించేలా "ఆకుపచ్చ సంప్రదాయం" కనిపించేలా బయోలుమినిసెన్స్ చూపించారు.
4. జైనుమతం, చైనీస్ భావనలు వంటి తత్వాలలో మనిషి ప్రతీ జీవి మంచి కోరేవాడు అనే సూత్రంపై నావి వాళ్ళా ఆలోచనలను రూపొందించారు. నావి విశ్వాసాలు స్థానిక-అమెరికన్ "బ్లాక్ ఎల్క్" మత ఆలోచనల దర్శనాలను కూడా సూచిస్తాయి.
5. అనంతమైన రేఖాగణిత అంతరిక్షంలోకి గ్రహం యొక్క స్పృహను యాక్సెస్ చేయడానికి జేక్ ని మేల్కొల్పడానికి చేసే వేడుక అమెజాన్‌లోని "అయాహువాస్కా" మాదిరిగానే ఒక "సైకెడెలిక్" వేడుక, ఇక్కడ మానవులు మనోధర్మిల ద్వారా పరిణామం చెందారని మూలాలకు కట్టుబడి ఉన్నవారని నమ్ముతారు.
6. నావి హ్యూమనాయిడ్ పిల్లి కళ్ళు ఉన్న గ్రహాంతరవాసులు, డార్విన్ తొలి హోమో సేపియన్ల నమూనాని వర్ణించినట్లే, సహజమైన సమాజాలలో నివసిస్తున్నారు.
7. జర్మన్ గణిత శాస్త్రజ్ఞుడు క్రిస్టియన్ వోల్ఫ్ వివరించిన మనిషి పరిమాణం, ఎత్తు, కొలతలు, కంటి పరిమాణానికి సంబంధించినదిగా వివరించాడు. అలాగే నావి కళ్ళు పెద్దవే, ఆకారము పెద్దదే.
8. చైనీస్ తత్వవేత్తలు మెటాఫిజిక్స్ అభ్యాసకులు విశ్వం ఒక డైనమిక్, ఆర్గానిస్మిక్ సైకోఫిజికల్ ఎలిమెంట్, "క్వి థింగ్" ద్వారా ఏకీకృతం చేయబడిందని నమ్ముతారు. కథానాయిక నెయిటిరి జేక్ కి బోధించేదీ ఇదే.
9. అవతార్ కథనంలో పారాసైకాలజీ కూడా ఉంది. మనుషులు తమ మనస్సులను అవతార్లతో నియంత్రిస్తారు, నావి డేటా నాడీ బదిలీ ద్వారా మొత్తం గ్రహంతో అనుసంధానించబడి ఉంటుంది కదా.
10. ప్లాటోనిక్ సంప్రదాయం ప్రకారం, శరీరం కేవలం సమాధి, మార్పులేని అస్తిత్వం, అయితే ఆత్మ స్వేచ్ఛగా మరియు పునర్జన్మ పొందేది. ఈ సినిమాలో చూపించినదీ అదే.
ఇవండీ! నాకు తోచిన, తెలిసిన కొన్ని విషయాలు. అందుకే ప్రపంచంలో ఏ మొలలోనైనా మూలలను పట్టి కథలో పెట్టారు కాబట్టే ప్రతీ ఒక్కరూ కనెక్ట్ అవుతున్నారనేది నా మాట. మీరేమంటారు? సెప్టెంబర్ 23న అవతార్ మొదటి భాగం 4కే అల్ట్రా హెచ్ డీ ఆర్ వెర్షన్ లో రి-రిలీజ్ అవుతోంది. డిసెంబర్ లో రెండో భాగం రానుంది.
Comments
Post a Comment